నెల మొదట్లోనే షాక్.. పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు
- పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర
- ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌పై రూ. 42 పెంపు
- హోటళ్లు, రెస్టారెంట్లపై స్వల్పంగా భారం
ఈ ధరల పెంపు ఇతర నగరాల్లోనూ వర్తిస్తుంది. కోల్‌కతాలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 53.50 పెరిగి రూ. 3,255.50కి చేరుకుంది. వీటితో పాటు ఢిల్లీలో 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (ఎఫ్టీఎల్) సిలిండర్ ధర కూడా రూ. 11 పెరిగి రూ. 821.50కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతినెలా జరిగే సమీక్షలో భాగంగా ఈ స్వల్ప పెంపు చోటుచేసుకుంది. గత మే నెలలో అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగా రూ. 993 పెంచిన విషయం తెలిసిందే. ఆ భారీ పెంపుతో పోలిస్తే తాజా వడ్డన చాలా తక్కువ. మరోవైపు, సబ్సిడీ కింద ఇచ్చే 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరను ఢిల్లీలో రూ. 913 వద్ద స్థిరంగా ఉంచారు.
తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థలపై నిర్వహణ భారం స్వల్పంగా పెరగనుంది. ఇదిలా ఉండగా, సబ్సిడీ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, పక్కదారి పట్టించడాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం తనిఖీలను ముమ్మరం చేసింది.