గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి

Gajuwaka Road Accident Three Killed in RTC Bus Collision
  • ప్రమాదంలో డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి
  • ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
  • రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఘటన
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన విషాదకర ఘటన విశాఖ జిల్లా గాజువాకలో ఈ రోజు వేకువజామున జరిగింది. శ్రీనగర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రవరం నుంచి 30 మంది ప్రయాణికులతో పార్వతీపురం వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఈరోజు వేకువజామున 4 గంటల సమయంలో గాజువాక శ్రీనగర్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని డ్రైవర్ గమనించకపోవడంతో ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రాంబాబు, ప్రయాణికురాలు ఈశ్వరమ్మతో పాటు మరో గుర్తుతెలియని మహిళ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Gajuwaka Road Accident
Visakhapatnam
RTC Bus Accident
Andhra Pradesh Road Accident
Road Accident Deaths
APS RTC
Rajamahendravaram
Parvathipuram
KGH Visakhapatnam
Police Investigation

More Telugu News