పీఎం సేతు పథకం అమలులో ఏపీ ఫస్ట్.. విశాఖ ఐటీఐ క్లస్టర్‌కు కేంద్రం ఆమోదం
- పీఎం సేతు పథకం అమలులో దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్
- విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
- ఆర్సెలర్ మిట్టల్, నామ్‌టెక్ భాగస్వామ్యంతో ఐటీఐల ఆధునికీకరణ
- పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యం
- దేశవ్యాప్తంగా 1000 ఐటీఐలను అభివృద్ధి చేసేందుకు రూ. 60,000 కోట్ల పథకం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్ (పీఎం-సేతు) పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఈ పథకం కింద విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్‌కు సంబంధించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికకు (SIP) కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ స్టీరింగ్ కమిటీ (NSC) ఆమోదముద్ర వేసింది. దేశవ్యాప్తంగా పీఎం-సేతు కింద ఆమోదం పొందిన తొలి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.
ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (AM/NS ఇండియా), న్యూ ఏజ్ మేకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నామ్‌టెక్)తో కలిసి ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా విశాఖపట్నంలోని ప్రభుత్వ ఐటీఐలను 'హబ్ అండ్ స్పోక్' నమూనాలో ఆధునికీకరిస్తారు. పరిశ్రమల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక శిక్షణ అందిస్తారు.
'వికసిత్ భారత్ 2047' లక్ష్యాల్లో భాగంగా, దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 60,000 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకాన్ని ప్రారంభించింది. కోర్సు పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం మొదటగా ప్రారంభం కానుండటంతో, ఇది ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.