జూన్ 3న సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం... అది చాలా మంచి రోజన్న వాస్తు నిపుణుడు

DK Shivakumar to be sworn in as CM on June 3
  • సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక
  • ప్రమాణ స్వీకారం ఖరారు చేసిన వాస్తు నిపుణుడు గురూజీ ఆరాధ్య
  • జూన్ 3 సాయంత్రం 5:15 గంటలకు వృశ్చిక లగ్నంలో కార్యక్రమం
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 3వ తేదీ సాయంత్రం 5:15 గంటలకు ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. వాస్తు నిపుణులు గురూజీ ఆరాధ్య స్వయంగా ఈ ముహూర్తాన్ని నిర్ణయించినట్లు శనివారం ప్రకటించారు.

శివకుమార్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన గురూజీ ఆరాధ్య, జూన్ 3 బుధవారం రోజు వృశ్చిక లగ్నంలో ప్రమాణ స్వీకారానికి శుభప్రదంగా ఉంటుందని తెలిపారు. వాస్తవానికి జూన్ 5వ తేదీని పరిశీలించినా, ఆ రోజు ఓ ముఖ్యమైన వ్యక్తి అందుబాటులో ఉండరన్న కారణంతో జూన్ 3ని ఖరారు చేసినట్లు ఆయన వివరించారు. శివకుమార్ జాతకానికి సంబంధించిన జ్యోతిష్యపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ బెంగళూరులోని అజ్జయ్య మఠాన్ని సందర్శించి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలిసిన అనంతరం ఆయన స్వామీజీతో భేటీ అయినట్లు సమాచారం. మరోవైపు, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్ధరామయ్య సీఎల్పీ నేతగా (తదుపరి సీఎంగా) డీకేఎస్ పేరును ప్రతిపాదించగా, కాంగ్రెస్ సభ్యులు బలపడరిచారు.
Go Back to Shorts
DK Shivakumar
Karnataka CM
Karnataka Chief Minister
June 3 Swearing In
Vastu Expert
Gurujee Aradhya
Siddaramaiah
Congress
Karnataka Politics

More Telugu News