సీఎం విజయ్ కుమారుడి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది!
- తమిళ నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో వస్తున్న 'సిగ్మా'
- ప్రపంచవ్యాప్తంగా జూలై 31న సినిమా విడుదల
- సందీప్ కిషన్ హీరోగా చిత్రం... లైకా ప్రొడక్షన్స్ నిర్మాణం
- తమిళ-తెలుగు భాషల్లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న వైనం
- ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు
ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. "సిగ్మా జూలై 31న థియేటర్లలోకి వస్తోంది. ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి" అని పోస్ట్ చేసింది. తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తుండటం విశేషం. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఫరియా అబ్దుల్లా ఓ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.
25 ఏళ్ల జేసన్ సంజయ్, కెనడా మరియు లండన్లలో ఫిల్మ్ మేకింగ్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. 2023 ఆగస్టులో ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ 65 రోజుల్లో పూర్తయింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. విజయ్ కుమారుడి తొలి సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మంచి ఆసక్తి నెలకొంది.