పార్టీ మారుతున్న నేతలకు 'కవిత'తో మమతా బెనర్జీ చురక
- బెంగాల్ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో మొదలైన అసమ్మతి
- ఊసరవెల్లి పేరుతో కవిత రాసిన మమత బెనర్జీ
- అవకాశవాద నేతలను విమర్శిస్తూ పరోక్ష హెచ్చరికలు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో పలువురు నాయకులు పార్టీని వీడుతున్నారు. వారిని ఉసరవెల్లిగా అభివర్ణిస్తూ మమతా బెనర్జీ ఓ కవిత రాసి తన సామాజిక ఖాతాలో పోస్టు చేశారు. 'గిర్గిటి' (ఊసరవెల్లి) అనే పేరుతో కవితను రాసి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి చురకలు అంటించారు.
ఎన్నికల్లో పరాజయం తర్వాత టీఎంసీలో అంతర్గతంగా అసంతృప్తి రాజుకుంది. కొందరు సీనియర్ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేయడం, నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కవిత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తరచూ రంగులు మార్చే ఊసరవెల్లితో అసమ్మతి నేతలను పోల్చుతూ, వారు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
కష్టకాలంలో పార్టీని, కార్యకర్తలను విస్మరించి సొంత ప్రయోజనాల కోసం చూసే నేతలను క్షమించేది లేదని ఆమె పరోక్షంగా హెచ్చరించారు. పార్టీకి క్లిష్టమైన సమయంలో ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. మీ ప్రవర్తనను ఇంకా ఎంత మార్చుకుంటారు, ఇంకా ఎంత కాలం మారాలని అనుకుంటున్నారని ఆమె కవిత ద్వారా ప్రశ్నించారు. అయితే ఈ కవితలో ఆమె ఎవరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. సమాజం, రాజకీయాల్లో కృతజ్ఞత, నైతిక విలువలు, మానవీయ స్పందనలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.