తమ కుమార్తె వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన కుష్బూ, సుందర్ దంపతులు
- భర్త సుందర్ సి, కుమార్తె, కాబోయే అల్లుడితో కలిసి భేటీ
- ఢిల్లీలో ప్రధానిని కలిసి వివాహ పత్రిక అందజేత
- వధూవరులను ప్రధాని ఆశీర్వదించారని తెలిపిన కుష్బూ
- సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్న బీజేపీ నాయకురాలు
ఈ సందర్భంగా కుష్బూ దంపతులు ప్రధాని మోదీకి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ప్రధానితో భేటీకి సంబంధించిన ఫోటోలను కుష్బూ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
"ఈరోజు ఢిల్లీలో గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని కలుసుకునే గౌరవం దక్కింది. నా భర్త సుందర్ సి, నేను కలిసి మా కుమార్తె అవంతిక, శ్రవణ్ శ్రీనివాసన్‌ల వివాహానికి ఆయనను ఆహ్వానించాము. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మాకు సమయం కేటాయించి, వధూవరులను ఆశీర్వదించిన ప్రధానికి మా కృతజ్ఞతలు. ఇది మాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాం" అని కుష్బూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఖుష్బూ దంపతుల చిన్న కుమార్తె అయిన అవంతిక నటిగా మలయాళంలో అరంగేట్రం చేయనున్నారు. ఆరంభం అనే మూవీలో ఆమె నటిస్తున్నారు. పెద్ద కుమార్తె ఆనందిక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.