కిచెన్‌లో మాస్టర్ బ్లాస్టర్... వంటవాడిగా మారిన సచిన్ టెండూల్కర్!
- కిచెన్‌లో సందడి చేసిన క్రికెట్ దిగ్గజం
- మహారాష్ట్ర సంప్రదాయ వంటకం మోదక్ తయారీ
- సామాజిక మాధ్యమాల్లో వీడియోను పంచుకున్న మాస్టర్ బ్లాస్టర్
- సచిన్ వంట నైపుణ్యంపై నెటిజన్ల ప్రశంసల వెల్లువ
వీడియోలో సచిన్ ఎంతో శ్రద్ధగా, సంప్రదాయ పద్ధతిలో ఈ వంటకాన్ని తయారుచేయడం కనిపిస్తుంది. ఆవిరి మీద ఉడికించే ఈ పదార్థాన్ని ఆయన చాలా నిపుణుడిలా తయారు చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. తాను తయారు చేసిన వంటకాన్ని తన తల్లికి రుచి చూపించాడు. ఆమెకు స్వయంగా తినిపించాడు. ఆ తర్వాత తాను స్వయంగా రుచి చూశాడు.
క్రికెట్ మైదానంలో ఎంత ఏకాగ్రతతో ఆడతారో, వంటగదిలో కూడా అంతే శ్రద్ధ చూపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "బ్యాటింగ్‌లోనే కాదు, వంటలో కూడా మాస్టర్ బ్లాస్టరే" అంటూ కొనియాడుతున్నారు. "క్రికెట్ దేవుడు కిచెన్‌లో కూడా దేవుడే" అని మరికొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.