శ్రీశైలంలో స్పర్శ దర్శనాల రద్దు

Srisailam Sparsha Darshan Cancelled
  • నేటి నుంచి సోమవారం వరకు స్పర్శ దర్శనాల నిలుపుదల
  • స్వామి వారి అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి
  • ఇప్పటికే ఆన్ లైన్ టికెట్లు పొందిన వారికి యథావిధిగా స్పర్శ దర్శనాలు
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. నేటి నుంచి సోమవారం వరకు స్పర్శ దర్శనాలు ఉండవని ఆయన తెలిపారు. కేవలం స్వామి వారి అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. అయితే, ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు మాత్రం యథావిధిగా స్పర్శ దర్శనాలను కొనసాగించనున్నట్టు తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 
Go Back to Shorts
Srisailam
Srisailam temple
Srisailam sparsha darshan
Sparsha darshan cancelled
Srinivas Rao EO
Lord Shiva temple
Andhra Pradesh temples
Online tickets
Devotee rush

More Telugu News