కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావొచ్చింది: అశ్వినీ వైష్ణవ్

  • త్వరలో కాజీపేటలో ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని వెల్లడి
  • రానున్న ఐదేళ్లలో 200 ఇంటర్ సిటీ రైళ్లను తయారు చేస్తుందన్న మంత్రి
  • ఇక్కడ తయారయ్యే రైళ్లను స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగిస్తామన్న మంత్రి
తెలంగాణ రాష్ట్రంలోని కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావొచ్చిందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. త్వరలో అక్కడ ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని అన్నారు. రానున్న ఐదేళ్లలో ఈ యూనిట్ 200 ఇంటర్ సిటీ రైళ్లను తయారు చేస్తుందని అన్నారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడ తయారయ్యే రైళ్లను దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చే ఇంటర్ సిటీ రైళ్లు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్‌తో రూపొందుతాయని అన్నారు. ప్రతి రైలులో 20 కోచ్‌లు ఉంటాయని అన్నారు.

గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైళ్లను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ రైళ్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుందని అన్నారు. రైలు బ్రేకులు వేసినప్పుడు ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌లోకి పంపే ఆధునాతన పరిజ్ఞానంతో తయారు చేస్తున్నామని అన్నారు.

Ashwini Vaishnaw
Kazipet
Kazipet Railway Unit
Telangana
Intercity Trains
Indian Railways
Train Manufacturing

More Telugu News