మమతా బెనర్జీకి మరో భారీ షాక్.. అధికార ప్రతినిధి శంతను సేన్ రాజీనామా

Mamata Banerjee Faces Setback as Shantanu Sen Resigns
  • కకోలి దస్తీదార్ రాజీనామా చేసిన మరుసటి రోజే షాకిచ్చిన శంతను
  • ఆర్జీకర్ హత్యాచార కేసు, అవినీతి ఆరోపణలతో మనస్తాపం చెందినట్లు వెల్లడి
  • అధికార ప్రతినిధిగా నా పాత్రను నిర్వర్తించే స్థితిలో లేనని వ్యాఖ్య
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. తాజాగా సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ శంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. నిన్న కకోలీ దస్తీదార్ ఘోష్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఈ రాజీనామా మరుసటి రోజే శంతను సేన్ షాకిచ్చారు.

2024 నాటి ఆర్జీకర్ హత్యాచార కేసు, పార్టీపై వస్తున్న నిరంతర అవినీతి ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నానని శంతను సేన్ పేర్కొన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా తన పాత్రను నిర్వర్తించే స్థితిలో లేనని తెలిపారు.

వివిధ సమయాల్లో తాను పార్టీ నిర్ణయాలతో ఏకీభవించలేదని, అనేక వివాదాస్పద అంశాలపై తాను బహిరంగంగానే ప్రశ్నించానని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రజలు తనను వివిధ సందర్భాలలో ఎంతగానో ప్రశంసించారని పేర్కొన్నారు. ఆర్జీకర్ కేసు, నిరుద్యోగం, అవినీతి సహా వివిధ అంశాల కారణంగా ప్రజలు తమను ఓడించారని, అందుకే అధికార ప్రతినిధిగా మాట్లాడటానికి తన మనసు అంగీకరించడం లేదని పేర్కొన్నారు.
Go Back to Shorts
Mamata Banerjee
Shantanu Sen
Trinamool Congress
West Bengal Politics
Kolkata
RG Kar Medical College

More Telugu News