భాగ్యశ్రీ బోర్సే గురించి అలాగే అనుకుంటున్నారు మరి!

  • గ్లామరస్ బ్యూటీగా భాగ్యశ్రీ 
  • సక్సెస్ లు లేకపోయినా తగ్గని క్రేజ్ 
  • అందంలో ఆమె తరువాతనే అంటున్న యూత్ 
  • 'లెనిన్'పై ఆశలు పెట్టుకున్న భాగ్యశ్రీ 
  • 'పెద్ది'లో ఆమె కూడా ఉంటే బాగుండేదంటున్న ఫ్యాన్స్ 
    


భాగ్యశ్రీ బోర్సే .. పాల సరస్సులో పూసిన తెల్లకలువలాంటి అందం. అమరశిల్పి జక్కన ఊహకి కూడా అందని శిల్పం.  మబ్బులను .. మెరుపులను కలిపి చేసినట్టుగా కనిపించే రూపం. చోళులు .. చాళుక్యుల కాలం నాటి శిల్పాల వరుసలో తప్ప, ఈ మధ్య కాలంలో ఎవరూ ఎక్కడా చూడని ఒక లావణ్య విశేషం. విశాలమైన కళ్లతో విన్యాసాలు చేస్తూ ఆమె యూత్ హృదయాలను కొల్లగొట్టేస్తోంది. అలాంటి భాగ్యశ్రీ బోర్సే గురించి మాట్లాడుకోని కుర్రాళ్లు ఉండరనే చెప్పాలి. 

తెరపై భాగ్యశ్రీని చూసిన కుర్రాళ్లంతా ఈ అమ్మాయికి నటన తెలియక పోయినా ఫరవాలేదు. అలా తెరపై కనిపిస్తూ ఉంటే చాలానే అనుకుంటారు. అందువల్లనే పెద్దగా సక్సెస్ లు లేకపోయినా, అవకాశాలు మాత్రం వెతుక్కుంటూనే వస్తున్నాయి. వచ్చే నెల చివరి వారంలో ఈ సుందరి 'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే ఒక టాక్ బలంగానే వినిపిస్తోంది. 

అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, 'పెద్ది' సినిమాలో భాగ్యశ్రీ కూడా మెరిసి ఉంటే బాగుండేదనే ఒక టాక్ ఇప్పుడు షికారు చేస్తోంది. 'పెద్ది'లో జాన్వీకపూర్ కథానాయికగా నటించగా, ఐటమ్ సాంగ్ లో శృతిహాసన్ సందడి చేయనుంది. మార్కెటింగ్ పరంగా చూసుకుంటే, మేకర్స్ నిర్ణయం సరైనదే అయినా, గ్లామర్ పరంగా చూసుకుంటే, భాగ్యశ్రీ కూడా ఎక్కడో ఒక చోట మెరిసే ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ తరువాత సినిమాలోనైనా ఈ బ్యూటీకి ఛాన్స్ దొరుకుతుందేమో చూడాలి మరి.   

Bhagyashree Borse
Lenin Movie
Peddi Movie
Janhvi Kapoor
Shruti Haasan
Akhil
Telugu Cinema
Tollywood
Glamour
Item Song

More Telugu News