'ఏఐ'కి డిమాండ్... 30 శాతానికి పైగా బోనస్ పెంచుతున్నట్లు టీఎస్ఎంసీ కంపెనీ ప్రకటన

TSMC Announces Over 30 Percent Bonus Increase Due to AI Demand
  • ప్రకటించిన తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ
  • ఈ సంవత్సరం ప్రాఫిట్ షేరింగ్ బోనస్‌ పెంపు
  • ఏఐ బూమ్‌తో సెమీ కండక్టర్ రంగంలో భారీగా లాభాలు
తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. ఈ సంవత్సరం లాభాల పంపిణీ చెల్లింపులను 30 శాతానికి పైగా పెంచుతున్నట్లు కంపెనీ అధిపతి సీసీ వీయ్ ప్రకటించారు. ఏఐ బూమ్‌తో సెమీ కండక్టర్ రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చిపడుతున్నాయి. దీంతో టీఎస్ఎంసీ మార్కెట్ విలువ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాఫిట్ షేరింగ్ బోనస్‌ను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.

అయితే సీనియారిటీ, గ్రేడ్, ప్రదర్శన ఆధారంగా చెల్లింపుల మొత్తంలో మార్పులు ఉంటాయి. మే 29వ తేదీన ఈ బోనస్‌లు ఇస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ కంపెనీ ఆదాయంలో 30 శాతం వృద్ధి నమోదైంది. ఎన్వీడియా, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలకు టీఎస్ఎంసీ కంపెనీ ఆధునాతన ప్రాసెసర్లను సరఫరా చేస్తోంది. రెవెన్యూ, తయారీపరంగా టీఎస్ఎంసీ ప్రపంచంలోనే నెంబర్ వన్ చిప్ తయారీ సంస్థ.

మార్కెట్ విలువ ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక వ్యాల్యూ కలిగిన కంపెనీ ఎన్విడియా. ఇటీవల తైవాన్ స్టాక్ మార్కెట్ దలాల్ స్ట్రీట్‌ను దాటి ఐదో స్థానంలో నిలవడానికి ప్రధాన కారణం ఎన్విడియా సంస్థ. ఏఐకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో తమ ఉత్పత్తులకు డిమాండ్ కొనసాగుతుందనే నమ్మకంతో ఉద్యోగులకు బోనస్‌ను పెంచినట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
TSMC
Taiwan Semiconductor Manufacturing Company
CC Wei
AI boom
semiconductor industry

More Telugu News