మైఖేల్ జాక్సన్ పాటకు శ్రద్ధా కపూర్ హుషారైన స్టెప్పులు.. ఇదిగో వీడియో!
- మైఖేల్ జాక్సన్ పాటకు నైట్ డ్రెస్‌లో డ్యాన్స్ చేసిన శ్రద్ధా కపూర్
- ఈ వీడియోను ఆమె ప్రియుడు రాహుల్ మోదీ తీసినట్లు ప్రచారం
- 'ఇలా డ్యాన్స్ చేయించే వ్యక్తిని వెతుక్కోండి' అంటూ ఆసక్తికర క్యాప్షన్
- గత కొంతకాలంగా రాహుల్ మోదీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు
- 'స్త్రీ 2' విజయం తర్వాత పలు సినిమాలతో బిజీగా ఉన్న నటి
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ క్లాసిక్ సాంగ్ ‘డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇనఫ్’కు శ్రద్ధా తన ఇంట్లో నైట్ డ్రెస్‌లోనే ఎంతో హుషారుగా స్టెప్పులేశారు. ఈ వీడియోను ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న రాహుల్ మోదీ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న శ్రద్ధా.. 'మిమ్మల్ని ఇలా డ్యాన్స్ చేయించే వ్యక్తిని వెతుక్కోండి' అంటూ ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జతచేశారు. దీంతో వీరిద్దరి బంధంపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది.
గత కొంతకాలంగా శ్రద్ధా కపూర్, సినీ రచయిత రాహుల్ మోదీ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ముంబైలో పలుమార్లు డిన్నర్ డేట్‌లకు వెళ్తూ వీరు కెమెరాలకు చిక్కారు. గతంలో వీరిద్దరూ విడిపోయారని రూమర్స్ రాగా, 2024 డిసెంబర్‌లో రాహుల్‌తో కలిసి వడా పావ్ తింటున్న ఫొటోను షేర్ చేసి శ్రద్ధా వాటికి చెక్ పెట్టారు. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ జంట తమ బంధాన్ని పరోక్షంగా వ్యక్త పరుస్తూనే ఉంది.
ఇక సినిమాల విషయానికొస్తే, 2024లో వచ్చిన 'స్త్రీ 2' చిత్రంతో శ్రద్ధా భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె 'పహాడ్‌పంగిరా', 'నాగిన్', 'ఈత' వంటి పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.