అన్నాడీఎంకేలో చీలికలేదు.. భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి: వేలుమణి
- పార్టీ అధినేత పళనిసామితో సమావేశమైన రెబల్ ఎమ్మెల్యేలు
- గైర్హాజరైన మాజీ మంత్రి షణ్ముగం
- పళనిసామికి పూర్తి మద్దతిస్తున్నట్లు వేలుమణి ప్రకటన
అన్నాడీఎంకే పార్టీలో ఎలాంటి చీలికలేదని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని సీనియర్ నాయకుడు వేలుమణి నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. వేలుమణి నేతృత్వంలో ఎమ్మెల్యేలు పార్టీ అధినేత పళనిసామితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అయితే టీవీకే ప్రభుత్వానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి షణ్ముగం మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు.
పళనిసామితో భేటీ అనంతరం వేలుమణి మాట్లాడుతూ, అన్నాడీఎంకేలో చీలిక లేదని ప్రకటించారు. పళనిసామికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తామంతా ఐక్యంగానే ఉన్నామని అన్నారు. మొదట షణ్ముగంను కలిసిన తర్వాత ఇక్కడకు వచ్చామని వెల్లడించారు. ఆ తర్వాత వేలుమణి బృందం స్పీకర్ను కలిసింది. అసెంబ్లీలో తామంతా ఒకే పార్టీగా పనిచేస్తామని ఆయనకు లేఖను సమర్పించింది.