చంద్రబాబు స్ఫూర్తిగానే ఆ సినిమా తీశారు: మహానాడులో కిరాక్ ఆర్పీ

Kirrak RP Speech Highlights Chandrababu Nara Lokesh Leadership
  • టీడీపీ మహానాడుకు హాజరైన కిర్రాక్ ఆర్పీ
  • 'ఒకేఒక్కడు' సినిమా చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని తీసిందేనని వెల్లడి
  • టీడీపీ సోషల్ మీడియా ఒక ఉద్యమంలా పనిచేస్తోందని వ్యాఖ్య
  • వైసీపీ తప్పుడు ప్రచారాలు చేసినా సంయమనంతో ఉంటున్నామని స్పష్టీకరణ
అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఒకేఒక్కడు' సినిమాకు స్ఫూర్తి టీడీపీ అధినేత చంద్రబాబేనని ఆ పార్టీ కార్యకర్త కిరాక్ ఆర్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకునే ఆ సినిమా తీశారని ఆయన అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

"అందరికీ నమస్కారం. ఈ రోజు మహానాడు వేదికపై నుంచి మాట్లాడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ముందుగా ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు ఎవరికంటే... 1995లో పార్టీని కాపాడిన చంద్రబాబుకు, 2024లో రాష్ట్రాన్ని ఒక రాక్షసుడి నుంచి కాపాడిన ఆయన తనయుడు లోకేష్ కు.

మన సోషల్ మీడియా సైన్యం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. వైసీపీ వాళ్లు చేసే తప్పుడు ప్రచారాలను, మార్ఫింగ్ వీడియోలను ఎప్పటికప్పుడు ఆధారాలతో తిప్పికొడుతూ నిజాలను ప్రజల ముందు ఉంచుతోంది మన సైన్యం. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎంతో మంది పార్టీ కోసం పనిచేస్తున్నారు. అందుకే అంటాను, వైసీపీ వాళ్లది ఉద్యోగం అయితే, మనది ఉద్యమం.

వైసీపీ వాళ్లు బూతులు మాట్లాడినా, నా భార్యపై తప్పుడు ప్రచారాలు చేసినా నేను సంయమనంతో ఉన్నాను. ఎందుకంటే, మన నాయకుడు లోకేష్ గారు మాకు స్పష్టంగా చెప్పారు.. "బూతులు, తప్పుడు ప్రచారం మన పసుపు సైన్యం నైజం కాదు" అని. వాళ్లు గూగుల్ డేటా సెంటర్‌కు మైండ్ అప్లై చేస్తే, మనం సోషల్ మీడియాను అప్లై చేశాం. కుప్పంకు నీళ్లు ఇచ్చారని వాళ్లు ప్రచారం చేసుకుంటే, మనం ఒకే ఒక్క వీడియోతో వాళ్లకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాం. వాళ్లు జులాయి సినిమాలో బ్రహ్మానందంలా వెంటనే దొరికిపోతారు.

గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు మన వాళ్లు పనిచేస్తున్నారు. పునర్విక విషయం అయినా, పాఠశాలలోని సమస్య అయినా, గల్ఫ్‌లో మహిళల కష్టాలైనా.. మేం సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన వెంటనే లోకేష్ గారు స్పందించి ఎందరికో సాయం చేశారు. ఇప్పుడు మన కర్తవ్యం ఒక్కటే. చంద్రబాబు గారు చేస్తున్న ప్రతి మంచి పనినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందరం కలిసికట్టుగా పనిచేసి 2029లో కూడా తెలుగుదేశం జెండా ఎగరేద్దాం" అంటూ కిరాక్ ఆర్పీ పిలుపునిచ్చారు.


Go Back to Shorts
Kirrak RP
Chandrababu Naidu
Oke Okkadu Movie
Nara Lokesh
TDP Mahanadu
Telugu Desam Party
Andhra Pradesh Politics
Social Media
YCP Counter
Political Campaign

More Telugu News