ఎన్టీఆర్ నాటిన మొక్కను చంద్రబాబు మహావృక్షంలా చేశారు: నక్కా ఆనందబాబు
- సామాజిక న్యాయానికి కట్టుబడి దళితులకు కీలక పదవులు ఇచ్చారన్న ఆనందబాబు
- దళితుల అభివృద్ధికి పున్నయ్య కమిటీ, ఎస్సీ కమిషన్ ఏర్పాటు టీడీపీ ఘనతే
- జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగిందని ఆరోపణ
- దళితుల అభివృద్ధి ఎవరితో సాధ్యమో ఆలోచించాలని పిలుపు
- టీడీపీ మహానాడులో నక్కా ఆనందబాబు ప్రసంగం
మహానాడు వేదికగా టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎస్సీ సంక్షేమంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు స్వర్గీయ ఎన్టీఆర్ నాటిన ‘టీడీపీ’ అనే మొక్కను, నేడు చంద్రబాబు ఒక మహావృక్షంగా తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు. “పేదవాడికి కూడు, గుడ్డ, నీడ” అనే లక్ష్యంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ, సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు దళితులకు కీలక పదవులు కట్టబెట్టి, వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టారని ఆనందబాబు గుర్తుచేశారు. దళితులలోని 59 కులాలకు న్యాయం చేసేందుకు వర్గీకరణకు మద్దతు ఇవ్వడంతో పాటు, వారి స్థితిగతుల మెరుగుదలకు జస్టిస్ పున్నయ్య కమిటీని ఏర్పాటు చేసి, సూచనలను అమలు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని వివరించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి, దళితుల హక్కుల పరిరక్షణకు చంద్రబాబు బాటలు వేశారని తెలిపారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళిత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య, విదేశీ విద్య అవకాశాలు కల్పించామని, దళితవాడల్లో సీసీ రోడ్లతో మౌలిక వసతులు మెరుగుపరిచామని చెప్పారు. ఇదే సమయంలో, జగన్‌మోహన్ రెడ్డి పాలనలో దళితులపై దమనకాండ కొనసాగిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఎవరి పాలనలో దళితులకు నిజమైన అభివృద్ధి, అవకాశాలు, గౌరవం లభించాయో దళిత సోదరులు ఆలోచించుకోవాలని నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు.