టీడీపీ మహానాడుపై రోజా తీవ్ర విమర్శలు
- 'మహానాడు'ను 'దగానాడు'గా అభివర్ణించిన రోజా
- అక్రమ కేసులతో వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపాటు
- సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ నేతలు విమర్శల జోరు పెంచారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి పాలనపై, ముఖ్యంగా నారా లోకేశ్ పదోన్నతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
టీడీపీ నిర్వహిస్తున్న మహానాడును ‘దగానాడు’గా అభివర్ణించిన రోజా... వైసీపీ నేతలను అక్రమ కేసులతో భయబ్రాంతులకు గురిచేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సొంతంగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క పనినైనా చూపించగలదా అని ప్రశ్నించారు. అలాగే ఎన్నికల ముందు ప్రకటించిన 'సూపర్ సిక్స్' పథకాలు ఏమయ్యాయని, అవి సూపర్ హిట్ ఎలా అయ్యాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.