అరణ్య ఫామ్‌హౌస్‌కు బండి భగీరథ్‌ను తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్
- బాధితురాలు, ఆమె తల్లి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
- మొయినాబాద్ మండలంలోని ఫామ్‌హౌస్‌లో సీన్ రీకన్స్ట్రక్షన్
- మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి
పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకుని మొయినాబాద్ మండలంలోని అరణ్య ఫామ్‌హౌస్‌కు తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పటికే పోలీసులు బండి భగీరథ్ నలుగురు స్నేహితులను ప్రశ్నించారు. బాధితురాలు, ఆమె తల్లి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
అరణ్య ఫామ్‌హౌస్‌లో తన కుమార్తెపై అఘాయిత్యం జరిగిందని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను ఒత్తిడి చేసి మద్యం తాగించి, అనంతరం అనుచితంగా ప్రవర్తించినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బండి భగీరథ్‌ను కస్టడీకి తీసుకువెళ్లి, సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.
ఈ నెల 16వ తేదీన అరెస్టైన బండి భగీరథ్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మల్కాజ్గిరి కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో పోలీసులు ఈరోజు ఉదయం చర్లపల్లి కేంద్ర కారాగారానికి చేరుకుని, అతడిని కస్టడీకి తీసుకున్నారు.