ఇలా అయిపోయాడేంటి... 'లుంగి డ్యాన్స్' సింగర్ హనీ సింగ్ కు ఏమైంది?
- తన మానసిక ఆరోగ్య సమస్యలపై మాట్లాడిన సింగర్ హనీ సింగ్
- బైపోలార్ డిజార్డర్ కారణంగా ఏడేళ్లు గదికే పరిమితమయ్యానని వెల్లడి
- తాను చనిపోయానని, నరకంలో ఉన్నానని భ్రమపడినట్లు వ్యాఖ్య
- మందుల వల్ల 105 కిలోల బరువు పెరిగి బట్టతల వచ్చిందన్న సింగర్
- ప్రస్తుతం కోలుకుంటున్నానని, ఇది విగ్గేనని ఓపెన్‌గా వెల్లడి
లుంగి డ్యాన్స్ సాంగ్ తో దేశవ్యాప్త పాప్యులారిటీ సంపాదించుకున్న ప్రముఖ సింగర్, ర్యాపర్ హనీ సింగ్ తన మానసిక ఆరోగ్య సమస్యలపై సంచలన విషయాలు వెల్లడించారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్ ఉచ్ఛస్థాయిలో ఉన్నప్పుడే బైపోలార్ డిజార్డర్‌తో తీవ్రంగా ఇబ్బంది పడ్డానని తెలిపారు. ఈ కారణంగా ఏకంగా ఏడేళ్ల పాటు ఇంటికే పరిమితమై, పూర్తి ఏకాంత జీవితం గడిపినట్లు చెప్పారు.
షారుఖ్ ఖాన్‌తో కలిసి అంతర్జాతీయ పర్యటనలో ఉన్నప్పుడు, ముంబైలో ఓ మ్యూజిక్ రియాలిటీ షో చేస్తున్న సమయంలో తనలో ఈ లక్షణాలు మొదలయ్యాయని హనీ సింగ్ వివరించారు. స్టేజ్‌పైనే చనిపోతానేమోనన్న తీవ్రమైన భయం, ఆందోళన తనను వెంటాడేవన్నారు. ఒకానొక దశలో చికాగోలో ప్రదర్శన ఇవ్వకుండా ఉండేందుకు తన తలను సగం షేవ్ చేసుకున్నానని, మరో షోలో రెండు పాటలు పాడి మధ్యలోనే వదిలేశానని గుర్తుచేసుకున్నారు.
తరువాత ఏడేళ్ల పాటు అభిమానులకు, స్నేహితులకు దూరంగా ఇంట్లోనే ఉండిపోయానని చెప్పారు. ఫోన్, టీవీ, ఇంటర్నెట్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉన్నానన్నారు. సుమారు మూడేళ్ల పాటు తన గది దాటి బయటకు రాలేదని, మరణ భయంతో బాత్రూమ్ తలుపు కూడా తెరిచే ఉంచుకునేవాడినని తెలిపారు. 2018-19 సమయంలో తాను అప్పటికే చనిపోయానని, స్వర్గానికి, నరకానికి మధ్య చిక్కుకుపోయానని భ్రమపడ్డానని చెప్పి ఆశ్చర్యపరిచారు.
ఏడేళ్ల పాటు వాడిన మందుల కారణంగా తన శరీర బరువు 105 కిలోలకు పెరిగిందని, జుట్టు పూర్తిగా ఊడిపోయి బట్టతల వచ్చిందని హనీ సింగ్ వెల్లడించారు. "ఇది నకిలీ జుట్టు, నాకు పూర్తిగా బట్టతల ఉంది. ఇది విగ్గు" అని ఇంటర్వ్యూలోనే ఓపెన్‌గా చూపించారు. డాక్టర్‌ను మార్చాక, కొత్త మందులు మొదలుపెట్టిన నాలుగు వారాల్లోనే మార్పు కనిపించిందని, అదే తన పునరాగమనానికి సహాయపడిందని అన్నారు. ఈ అనుభవం తనకు 30 ఏళ్ల వయసులోనే ఎదురవ్వడం మంచిదైందని భావిస్తున్నట్లు హనీ సింగ్ పేర్కొన్నారు.