సింహాన్ని నిద్ర లేపొద్దు అని ముందే చెప్పాం... ఇప్పుడైనా అర్థమైందా?: బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్

Bandla Ganesh Interesting Tweet on Pawan Kalyan Performance
  • పవన్ కల్యాణ్‌ను సింహంతో పోల్చిన బండ్ల గణేష్
  • సింహం నిద్రలేచింది.. ఆట మొదలైందంటూ వ్యాఖ్య
  • తప్పు, అవినీతి జరిగితే ఊరుకోదని సోషల్ మీడియాలో పోస్ట్
  • గోదావరి కాలుష్యంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో బండ్ల స్పందన
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తనదైన శైలిలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు. పవన్ కల్యాణ్ పనితీరును ఉద్దేశించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. "సింహాన్ని నిద్ర లేపొద్దు అని ముందే చెప్పాం... ఇప్పుడైనా అర్థమైందా? ఆట మొదలైంది... తప్పు జరిగితే ఈ సింహం ఊరుకోదు, అవినీతి జరిగితే సహించదు. తాను నిద్రపోదు... నిద్రపోనివ్వదు. అది సింహం నైజం... మనమేం చేయలేం!" అంటూ బండ్ల గణేష్ తన పోస్టులో పేర్కొన్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటన సందర్భంగా గోదావరి నది పుష్కర ఏర్పాట్లను సమీక్షించారు. ఇవాళ గోదావరి నదిని పరిశీలించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నది కలుషితమవుతున్న తీరును భరించలేకపోయిన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుస్థితిలో ఉన్న గోదావరిని చూస్తుంటే, తెలుగు తల్లి పాటలోని కొన్ని లైన్లను మార్చేయాల్సిన అవసరం ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మురుగు నీటితో పుణ్యం ఏమో కానీ, రోగాలు వస్తాయని అసహనం వెలిబుచ్చారు. గోదావరి పునరుద్ధరణకు అక్కడిక్కడే అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. దీనిపై బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Go Back to Shorts
Bandla Ganesh
Pawan Kalyan
Janasena
AP Deputy CM
Godavari River
River Pollution
Andhra Pradesh Politics
Pushkar Arrangements
Rajahmundry
Telugu Thalli

More Telugu News