పేరుకే 'కేవియర్ పానీ పూరీ'.. ఇందులో పానీ ఉండదు!

  • డెన్మార్క్‌లోని మిష్లిన్ స్టార్ రెస్టారెంట్‌లో పానీపూరి
  • 'స్మోకీ బాల్' పేరుతో క్యావియర్, క్రీమ్‌తో సర్వ్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • 'పానీ లేని పానీపూరి' అంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
మన వీధుల్లో 20 రూపాయలకే దొరికే పానీపూరి, ఇప్పుడు డెన్మార్క్‌లోని ఓ అత్యంత ఖరీదైన రెస్టారెంట్‌లో కొత్త అవతారమెత్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హేగెన్‌లోని మిష్లిన్ స్టార్ రెస్టారెంట్ 'ఆల్కెమిస్ట్' మెనూలో పానీపూరిని పోలిన ఒక వంటకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ రెస్టారెంట్‌లో దీని పేరు 'స్మోకీ బాల్'. చూడటానికి అచ్చం పానీపూరిలా ఉండే ఈ బాల్‌ను పగలగొడితే లోపల స్టర్జన్ కేవియర్ (చేప గుడ్లు), లాంగొస్టీన్ టార్టేర్, బాదం క్రీమ్ వంటి ఖరీదైన పదార్థాలు ఉంటాయి. దీనికి మరింత నాటకీయతను జోడించడానికి, సర్వ్ చేసే ముందు ఇందులో సువాసనగల పొగను నింపుతారు. ఇది సుమారు 7.5 గంటల పాటు జరిగే 40కు పైగా వంటకాల టెస్టింగ్ మెనూలో ఒక భాగం.

@highspeeddining అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ అవ్వగానే, భారతీయుల నుంచి ఫన్నీ కామెంట్ల వర్షం కురిసింది. "ఇది మిష్లిన్ స్టార్ పానీపూరి", "GTA 6 కంటే ముందే మనకు కేవియర్ పానీపూరి వచ్చేసింది" అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానించారు. మరొకరు "భారత్‌లో దీనికి 50 సెంట్లు మాత్రమే" అని పోల్చారు. అయితే, చాలామంది అసలైన పసందైన 'పానీ' లేకపోవడంపై సరదాగా ఫిర్యాదు చేశారు.




Alchemist Restaurant
Copenhagen
Denmark
Pani Puri
Smoky Ball
Michelin Star Restaurant
Caviar Pani Puri
Indian Street Food
Viral Video

More Telugu News