అలాంటి వారిని నేరాలు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా శిక్షించాలి: సీఎం విజ‌య్‌

CM Vijay orders strict action against criminals in Tamil Nadu
  • మహిళలు, చిన్నారులపై నేరాల్లో కఠినంగా వ్యవహరించాల‌న్న‌ సీఎం విజయ్ 
  • తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను వెంటనే నమోదు చేయాలని ఆదేశం
  • దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్న సీఎం
తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల విషయంలో కేసులను తక్షణమే నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. నేడు రాష్ట్ర సచివాలయంలో శాంతిభద్రతలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కేసుల నమోదులో జాప్యం వద్దు.. నేరగాళ్లకు కఠిన శిక్షలు పడాలి
ఈ సమావేశంలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో జాప్యం జరగకూడదని అన్నారు. చట్టపరమైన చ‌ర్య‌ల‌ను అనుసరించి, దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి, నేరగాళ్లకు కఠిన శిక్షలు పడితే, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేయడానికి ఇతరులు భయపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.

మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణలో ఎలాంటి జాప్యం లేకుండా దర్యాప్తు సంస్థలు, సంబంధిత ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. నేరాల నివారణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కూడా చాలా ముఖ్యమని ఆయన నొక్కిచెప్పారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం. సాయికుమార్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. మణివాసన్, అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్, డీజీపీ డాక్టర్ సందీప్ రాయ్ రాథోడ్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళల భద్రతపై ప్రజా స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.
Go Back to Shorts
CM Vijay
Tamil Nadu CM
Tamil Nadu Chief Minister
crime prevention
women safety
child safety
police investigation
law enforcement
Sandeep Rai Rathore
Maniwasan

More Telugu News