గిట్టుబాటు కాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. వెనక్కి తగ్గుతున్న మైక్రోసాఫ్ట్
- ఉద్యోగులకు ఆంత్రోపిక్ 'క్లాడ్ కోడ్' యాక్సెస్‌ను తగ్గించిన మైక్రోసాఫ్ట్
- విపరీతంగా పెరిగిన ఏఐ వినియోగ ఖర్చులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం
- ప్రత్యామ్నాయంగా సొంత గిట్‌హబ్ కోపైలట్‌ను వాడాలని ఇంజినీర్లకు సూచన
- ఏఐ టూల్స్‌పై టెక్ కంపెనీల బడ్జెట్ వేగంగా ఖర్చవుతోందని నివేదికలు
- ఆంత్రోపిక్‌తో మైక్రోసాఫ్ట్ ప్రధాన భాగస్వామ్యం మాత్రం యథాతథం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం ఒకవైపు కొత్త అవకాశాలు సృష్టిస్తుంటే, మరోవైపు దాని నిర్వహణ ఖర్చులు టెక్ దిగ్గజాలకు పెనుభారంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ వాడకం వల్ల కంప్యూటింగ్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుండటంతో తమ ఉద్యోగులకు ఆంత్రోపిక్ సంస్థకు చెందిన 'క్లాడ్ కోడ్' ఏఐ టూల్ యాక్సెస్‌ను క్రమంగా తగ్గిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా తమ సొంత ప్లాట్‌ఫామ్ అయిన 'గిట్‌హబ్ కోపైలట్ సీఎల్ఐ'ని వినియోగించేలా ఇంజినీర్లను ప్రోత్సహిస్తోంది.
కొంతకాలం క్రితం ఏఐ ఆధారిత కోడింగ్ టూల్స్‌పై ప్రయోగాలను ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్ వేలాది మంది డెవలపర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, డిజైనర్లకు 'క్లాడ్ కోడ్' యాక్సెస్‌ను విస్తృతంగా కల్పించింది. అయితే, ఉద్యోగుల నుంచి దీని వాడకం అనూహ్యంగా పెరగడంతో సంస్థ కార్యాచరణ వ్యయాలు భారీగా పెరిగాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) టోకెన్ ఆధారిత ధరల విధానాన్ని అనుసరిస్తాయి. అంటే.. ఏఐ సిస్టమ్ ప్రాసెస్ చేసే, జెనరేట్ చేసే టెక్స్ట్ పరిమాణం ఆధారంగా కంపెనీలు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే ఖర్చుల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది.
ఈ సమస్య కేవలం మైక్రోసాఫ్ట్‌కే పరిమితం కాలేదు. పలు టెక్ కంపెనీలు ఇదే తరహా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు ప్రముఖ రైడ్-షేరింగ్ సంస్థ ఉబెర్.. ఏఐ కోడింగ్ టూల్స్ కోసం కేటాయించిన 2026 బడ్జెట్‌ను ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే పూర్తిగా వినియోగించినట్లు ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నెప్పల్లి నాగ వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
భవిష్యత్తులో ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్ (స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్లు) వాడకం పెరిగితే టోకెన్ల వినియోగం మరింత భారీగా పెరుగుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఏఐ మోడల్స్ నిర్వహణ ఖర్చు కాలక్రమేణా తగ్గినా, కొత్తతరం ఏజెంటిక్ సిస్టమ్స్ ప్రతి పనికి ఎక్కువ టోకెన్లు వినియోగించడం వల్ల సంస్థల మొత్తం ఏఐ వ్యయం పెరుగుతుందని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ పేర్కొంది.
అయితే, క్లాడ్ కోడ్ యాక్సెస్‌ను తగ్గించినప్పటికీ, ఆంత్రోపిక్‌తో మైక్రోసాఫ్ట్ కుదుర్చుకున్న మల్టీ-బిలియన్ డాలర్ల 'ఫౌండ్రీ' ఒప్పందం వంటి ప్రధాన భాగస్వామ్యాలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది. అజూర్ క్లౌడ్ సేవల ద్వారా ఆంత్రోపిక్ మోడల్స్‌కు యాక్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఏఐ వైపు వేగంగా అడుగులు వేసేందుకు మెటా, ఒరాకిల్, క్లౌడ్‌ఫ్లేర్ వంటి సంస్థలు ఇటీవల పునర్వ్యవస్థీకరణ చర్యలు, ఉద్యోగ కోతలను ప్రకటించడం గమనార్హం.