ఆకాశంలో విమానం ఢీకొట్టినా బతికిన పారాగ్లైడర్.. షాకింగ్ వీడియో!

Paraglider Survives Mid Air Plane Collision in Austria
  • ఆస్ట్రియా ఆల్ప్స్ పర్వతాల్లో ప్రమాదం
  • ముక్కలైన పారాగ్లైడర్ పారాచూట్‌
  • ఎమర్జెన్సీ పారాచూట్‌తో బతికిన మహిళ
  • ఒక్కసారిగా అడ్డురావడంతో తప్పించలేకపోయానన్న పైలట్‌
ఆస్ట్రియా ఆల్ప్స్ పర్వతాల్లో భయంకరమైన ప్రమాదం జరిగింది. ఆకాశంలో ప్రయాణిస్తున్న పారాగ్లైడర్‌ను ఓ చిన్న విమానం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పారాచూట్‌ ముక్కలైనా సబ్రినా అనే 44 ఏళ్ల అనుభవజ్ఞురాలైన మహిళా పారాగ్లైడర్‌ సురక్షితంగా బయటపడడం విశేషం.

ఎమర్జెన్సీ పారాచూట్‌తో సేఫ్
విమానం ఢీకొనగానే సబ్రినా నియంత్రణ కోల్పోయారు. వేగంగా భూమివైపునకు దూసుకొచ్చారు. ఆ ప్రమాదకర స్థితిలోనూ కంగారుపడకుండా.. తన దగ్గరున్న ఎమర్జెన్సీ పారాచూట్‌ను తెరిచారు. అది సకాలంలో ఓపెన్ కావడంతో ఆమె వేగం తగ్గి సురక్షితంగా నేలపై ల్యాండ్ కాగలిగారు.

నమ్మలేకపోతున్నా
సబ్రినాకు ఒంటిపై కొన్ని గీతలు, చిన్న గాయాలు మినహా ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు హెలికాప్టర్‌లో వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. తను ప్రాణాలతో తిరిగి రావడం నమ్మలేకపోతున్నానని సబ్రినా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఒక్కసారిగా అడ్డురావడంతో తప్పించడం కుదరలేదని విమాన పైలట్‌ పోలీసులకు వివరించారు.
Go Back to Shorts
Sabrina
Paragliding accident Austria
Austria Alps paragliding
Paraglider plane collision
Emergency parachute landing
Air accident survival
Viral video paragliding
Paragliding safety

More Telugu News