డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ప్రభాస్ అండగా నిలిచాడు: జగపతి బాబు

Jagapathi Babu Praises Prabhas for Support During Depression
  • వయసులో చిన్నవాడైనా ప్రభాస్ మనసు చాలా పెద్దదన్న జగపతిబాబు
  • ఎన్ని అవార్డులు గెలిచినా రాజమౌళి చాలా వినయంగా ఉంటారని వెల్లడి
  • తాజాగా రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో కీలకపాత్రలో నటించిన జగ్గూభాయ్
ప్రముఖ నటుడు జగపతి బాబు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర పరిశ్రమలో తాను కలిసిన గొప్ప మనసున్న వారిలో ప్రభాస్ ఒకరని ఆయన అభివర్ణించారు. తాను డిప్రెషన్‌తో బాధపడుతున్న క్లిష్ట సమయంలో ప్రభాస్ తనకు అండగా నిలిచిన తీరును గుర్తుచేసుకున్నారు.

"నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఒకసారి ప్రభాస్‌తో మాట్లాడాలనిపించింది. ఆ సమయంలో ఆయన జార్జియాలో షూటింగ్‌లో ఉన్నాడు. అయినా నా ఫోన్‌కు స్పందించి 'డార్లింగ్, నేనున్నానుగా. నీ సమస్యేంటో చెప్పు, నేను పరిష్కరిస్తా' అని చెప్పి ఎంతో ధైర్యం ఇచ్చాడు. ఆ మాటలు నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి" అని జగపతి బాబు తెలిపారు. జార్జియా నుంచి తిరిగి వచ్చాక కూడా ప్రభాస్ తనను వ్యక్తిగతంగా కలిసి ధైర్యం చెప్పాడని అన్నారు. వయసులో తనకంటే చిన్నవాడైనా ప్రభాస్ మనసు చాలా పెద్దదని, అందరినీ ప్రేమగా చూసుకుంటాడని కొనియాడారు.

ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గురించి కూడా జగపతి బాబు గొప్పగా మాట్లాడారు. ఎన్ని అవార్డులు గెలిచినా రాజమౌళి, ఆయన కుటుంబం చాలా వినయంగా ఉంటారని, వారికి ఎలాంటి ఇగో ఉండదని చెప్పారు. పాత్రకు ఎవరు సరిపోతారో వారినే రాజమౌళి ఎంపిక చేస్తారని, వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వరని ఆయన వృత్తి నిబద్ధతను ప్రశంసించారు.

జగపతి బాబు తాజాగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'పెద్ది' చిత్రంలో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన అప్పలసూరి అనే కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
Go Back to Shorts
Jagapathi Babu
Prabhas
depression
Tollywood
SS Rajamouli
Ram Charan
Peddhi Movie
Buchi Babu Sana
Appalasuri
Telugu cinema

More Telugu News