పవన్‌తో భేటీ... జనసేన విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా
- జనసేన విప్ పదవికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా
- అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేత
- వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్లు ప్రకటన
- మహిళా ఉద్యోగి ఆరోపణల వివాదం నేపథ్యంలో ఈ పరిణామం
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన శాసన సభ విప్ పదవికి రాజీనామా చేశారు. శనివారం పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే శ్రీధర్ ఈ నిర్ణయం తీసుకున్నారని జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ఇటీవల అరవ శ్రీధర్‌పై రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు పవన్ కల్యాణ్ త్రిసభ్య కమిటీని కూడా నియమించారు. కమిటీ ముందు హాజరైన శ్రీధర్, ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.
అయితే, ఆరోపణలు చేసిన మహిళ ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా వీడియోలు విడుదల చేస్తూ తన వాదన వినిపిస్తున్నారు. ఈ వివాదం కొనసాగుతున్న తరుణంలోనే శ్రీధర్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై వస్తున్న ఆరోపణలు, నెలకొన్న వివాదంపై పవన్ కల్యాణ్‌కు శ్రీధర్ వివరణ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ రాజీనామా ఆయన స్వయంగా చేశారా? లేక పార్టీ అధిష్ఠానం సూచన మేరకు జరిగిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.