ఇవాంకా ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర? అమెరికాలో కలకలం

Ivanka Trump Targeted in Alleged Iranian Assassination Plot
  • ఇరాన్‌ అండతో ఓ ఉగ్రవాద సంస్థ వ్యూహం
  • ఇరాన్‌ కమాండ్‌ ఖాసీం సులేమానీ మృతికి ప్రతీకారం
  • సూత్రధారిగా ఇరాకీ జాతీయుడు అల్-సాదీపై అనుమానం
  • నిందితుడి దగ్గర ఇవాంకా ఇంటి బ్లూప్రింట్‌
  • గతంలోనూ కీలక దాడులు చేసినట్లు ఆధారాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను హత్య చేయడానికి కుట్ర జరిగినట్లు అగ్రరాజ్య మీడియా వెల్లడించింది. ఇరాన్ అండతో నడిచే ఓ ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి వ్యూహం రచించినట్లు సమాచారం. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకారంగానే ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

దొరికిన కీలక ఆధారాలు
ఈ కుట్రకు సూత్రధారిగా భావిస్తున్న 32 ఏళ్ల ఇరాకీ జాతీయుడు మహ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్-సాదీని మే 15న టర్కీలో అరెస్ట్ చేసి అమెరికాకు అప్పగించారు. నిందితుడి వద్ద ఇవాంకా ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడా ఇంటి బ్లూప్రింట్ లభించినట్లు సమాచారం. గతంలోనే అతడు ఇవాంకా ఇంటి మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘‘మీ భవనాలు, సీక్రెట్ సర్వీస్ మిమ్మల్ని రక్షించలేవు’’ అంటూ అరబిక్‌లో హెచ్చరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ దాడులతో లింకు
అమెరికా నిఘా వర్గాల కథనం ప్రకారం అల్-సాదీ కేవలం ఇవాంకా హత్యకు ప్లాన్‌ వేయడమే కాకుండా.. యూరప్, అమెరికాల్లోని పలు సంస్థలపై జరిగిన దాదాపు 18 దాడుల వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. లండన్‌లో యూదులపై దాడి, టొరంటోలోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల జరిగిన కాల్పుల ఘటనల్లో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నిందితుడిని బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఒంటరి జైలు గదిలో ఉంచి విచారిస్తున్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ కుట్ర బయటపడటం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.
Go Back to Shorts
Ivanka Trump
Iran
Assassination plot
Qassem Soleimani
Mohammad Baker Saad Aldawoud Al-Sadi
Terrorism
US-Iran relations
Trump family
Middle East
International security

More Telugu News