నారా దేవాన్ష్ 'డైనో డీట్స్' తొలి ఎపిసోడ్ వచ్చేసింది... లోకేష్ రియాక్షన్ ఇదిగో!
- తనయుడి పాడ్‌కాస్ట్‌పై నారా లోకేశ్ హర్షం
- డైనోసార్ల ప్రపంచాన్ని పరిచయం చేసిన దేవాన్ష్
- అవి భూమిపై 150 మిలియన్ల ఏళ్లకు పైగా జీవించాయని వెల్లడి
- భారత్‌లో తిరిగిన రాజాసారస్ అనే డైనోసార్
- 800 రకాల డైనోసార్లను గుర్తించినట్లు వెల్లడి
మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ డిజిటల్ దునియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘డైనో డీట్స్’ పేరుతో అతడు ప్రారంభించిన సరికొత్త యూట్యూబ్ పాడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్ శుక్రవారం విడుదలైంది. 10 ఏళ్ల వయసులోనే దేవాన్ష్ ఎంతో ఆత్మవిశ్వాసంతో, చక్కని ఇంగ్లిష్‌తో డైనోసార్ల ప్రపంచాన్ని కళ్లముందు ఉంచిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
లోకేశ్ రియాక్షన్
‘‘డైనోసార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టండి’’ అంటూ దేవాన్ష్‌ను ప్రోత్సహిస్తూ లోకేశ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘దేవాన్ష్ మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి మెసోజోయిక్ యుగం విశేషాలను, పురాతన శిలాజాల్లో దాగి ఉన్న సూక్ష్మ రహస్యాలను లోతుగా పరిశోధించి వివరించబోతున్నాడు. ముఖ్యంగా మిలియన్ల సంవత్సరాల క్రితం మన భారతదేశ గడ్డపై సంచరించిన ప్రమాదకరమైన జంతువు గురించి ప్రత్యేక విశేషాలను చూపించబోతున్నాడు. డైనోసార్ల అభిమానులతో పాటు విజ్ఞానాన్ని ఇష్టపడే వారందరికీ ఈ గత చరిత్రను సరికొత్తగా పరిచయం చేయనున్నాడు. గతం ఇప్పటికీ మన కళ్లముందే సజీవంగా ఉందనే విషయాన్ని నిరూపించబోతున్నాడు’’ అంటూ లోకేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
దేవాన్ష్ వీడియోలో ఏముంది?
మొదటి ఎపిసోడ్‌లో దేవాన్ష్ ప్రొఫెషనల్ హోస్ట్‌లా స్టుడియో సెటప్‌లో కూర్చొని డైనోసార్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
వీడియోలోని ఇతర ఆసక్తికర అంశాలు

- జురాసిక్ వరల్డ్ సినిమాల్లో చూపించినట్లుగా డైనోసార్లు 201-145 మిలియన్ల ఏళ్ల క్రితం జీవించలేదు. 145-66 మిలియన్ల ఏళ్ల క్రితం అవి భూమిపై సంచరించాయి.
- డైనోసార్లు భూమిపై 150 మిలియన్ల ఏళ్లకు పైగా జీవించాయి.
- కొన్ని డైనోసార్లు పక్షి పరిమాణంలో ఉంటే మరికొన్ని భారీ చెట్టు సైజ్‌లో ఉండేవి. 800 రకాల డైనోసార్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
- రాజాసారస్ అనే డైనోసార్ భారత్‌లో ఉండేది.