ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్.. ‘రోబో సైన్యం’తో 38 నెలల్లో పూర్తి!
- ‘చాంగ్కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్’పై ఎలాన్ మస్క్ పోస్ట్
- రోబోల సాయంతో 38 నెలల్లోనే భారీ ప్రాజెక్ట్ పూర్తి
- మనుషుల కంటే మూడు రెట్లు వేగంగా కాంక్రీట్ పనులు
- గ్లాస్ అమరిక రోబోలతో తగ్గిన ప్రమాదాల ముప్పు
- ఏఐ, 5జీ టెక్నాలజీతో పనిచేసిన రోబో సైన్యం
ప్రపంచంలోనే అతిపెద్దదైన చైనాలోని ‘చాంగ్కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్’ నిర్మాణ దృశ్యాలు టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ను సైతం ఆశ్చర్యపరిచాయి. గతంలో ప్రజా రవాణాపై పెదవి విరిచిన ఆయన.. ఈ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 40 డిగ్రీల ఎండ, కొండ ప్రాంతంలో కేవలం 38 నెలల రికార్డు కాలంలోనే చైనా ఈ అద్భుతాన్ని నిర్మించడం వెనుక ఒక పెద్ద ‘రోబో విప్లవం’ దాగి ఉంది.
రోబోల సైన్యం చేసిన మాయ
చైనాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ జిన్హువా కథనం ప్రకారం.. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం చైనా పెద్ద ఎత్తున రోబోల సైన్యాన్ని రంగంలోకి దించింది. లేజర్ సాయంతో నడిచే ఫోర్-వీల్ రోబోలు మనుషుల కంటే మూడు రెట్లు వేగంగా, మిల్లీమీటర్ల కచ్చితత్వంతో కాంక్రీట్ లెవలింగ్ పనులను పూర్తి చేశాయి. ఏఐ, 5జీ సాంకేతికతతో పనిచేసిన ఈ రోబోల వల్ల కార్మిక ఖర్చులు 40 శాతం వరకు తగ్గినట్లు సమాచారం.
రిస్క్ తగ్గింది.. వేగం పెరిగింది
దాదాపు 800 కిలోల బరువైన భారీ గ్లాస్ ప్యానెళ్లను అమర్చడానికి ప్రత్యేక రోబోలను ఉపయోగించారు. ఇవి ప్రమాదాల ముప్పును 90 శాతం తగ్గించడమే కాకుండా, పనులను మూడు రెట్లు వేగవంతం చేశాయని నిర్మాణ సంస్థ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు రాత్రింబవళ్లు గస్తీ కాసే పెట్రోలింగ్ రోబోలు, వెల్డింగ్ రోబోలు కూడా ఈ పనుల్లో పాల్గొన్నాయి.
నగరమంత పెద్ద స్టేషన్
గతేడాది మే నెలలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ స్టేషన్ వైశాల్యం అక్షరాలా 1.22 మిలియన్ చదరపు మీటర్లు. ఇందులో 15 ప్లాట్‌ఫామ్‌లు, 29 రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. రద్దీ సమయాల్లో గంటకు 16 వేల మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం దీని సొంతం. ఈ ఒక్క స్టేషన్ నుంచి చైనాలోని బీజింగ్, షాంఘై వంటి 14 ప్రధాన నగరాలకు హైస్పీడ్ రైలు కనెక్టివిటీ ఉంది.