కేరళంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

Pawan Kalyan Congratulates New Kerala Government
  • కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం
  • కేబినెట్ లో కొలువుతీరిన పలువురు మంత్రులు
  • నూతన నాయకత్వంలో రాష్ట్రం సరికొత్త అభివృద్ధిని సాధించాలన్న పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళ నూతన ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్‌కు, అలాగే ఆయనతో పాటు మంత్రివర్గంలో కొలువుదీరిన మంత్రులందరికీ అభినందనలు అందజేశారు.


ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, కేరళంలో కొలువుదీరిన నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పారదర్శకమైన, ప్రగతిశీలమైన సుపరిపాలనను అందిస్తూ కేరళంను మరింత అభ్యుదయ పథంలోకి తీసుకెళ్లాలని కోరారు. ‘దేవుని సొంత దేశం’గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి గడించిన కేరళం రాష్ట్రం, ఈ నూతన నాయకత్వంలో సరికొత్త అభివృద్ధిని, అపార సుసంపన్నతను సాధించాలంటూ పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Go Back to Shorts
Pawan Kalyan
Kerala Government
VD Satheesan
Kerala Chief Minister
Andhra Pradesh Deputy CM
Kerala Ministers
Kerala Politics
New Government

More Telugu News