Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆయన పేరు లోకేష్ కాదు... ఎందుకంటే ఆయన డబ్బునే ప్రేమిస్తారు: అంబటి రాంబాబు

Ambati Rambabu Calls Nara Lokesh Love Cash
Advertisement
  • ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు
  • లోకేష్ కు 'లవ్ క్యాష్' అని పేరు పెట్టిన అంబటి
  • చిన్నప్పుడు అన్నప్రాశనలో లోకేష్ డబ్బే పట్టుకున్నారని సెటైర్లు
  • ఈ విషయం హరికృష్ణే చెప్పారంటూ అంబటి వ్యాఖ్య
Advertisement
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు.. ఏపీ మంత్రి నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లోకేష్ కు 'లవ్ క్యాష్' అనే కొత్త పేరు పెడుతున్నట్లు ప్రకటించి, ఆయన డబ్బును అమితంగా ప్రేమిస్తారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. "ఆయన పేరు లోకేష్ కాదు, లవ్ క్యాష్. ఎందుకంటే ఆయన డబ్బును ప్రేమిస్తారు" అని అన్నారు. లోకేశ్‌ చిన్నప్పుడు అన్నప్రాశన సమయంలో బంగారం, పుస్తకాలు వంటివి కాకుండా డబ్బునే పట్టుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని లోకేష్ మేనమామ అయిన నందమూరి హరికృష్ణ తనకు స్వయంగా చెప్పారని అంబటి గుర్తుచేశారు. చిన్నప్పటి నుంచే లోకేష్ కు డబ్బుపై ప్రేమ ఎక్కువని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాష్ట్రంలో ఇంధన ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని కోరుతూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో అంబటి పాల్గొన్నారు. ప్రస్తుతం నారా లోకేష్ ను ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Advertisement
Ambati Rambabu
Nara Lokesh
YSRCP
Andhra Pradesh
Fuel Prices
Guntur Protest
Love Cash
Nandamuri Harikrishna

More Telugu News