వితంతువులకు శుభవార్త.. ఏపీలో జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు
- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు
- కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు సర్కారు
- వితంతువులకు కొత్తగా పెన్షన్లు
- త్వరలోనే ఆన్ లైన్ లో పేర్లు నమోదుకు అవకాశం
రాష్ట్రంలోని వితంతువులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12వ తేదీ నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులు త్వరలోనే ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల అనేక రెవెన్యూ సమస్యలు పేరుకుపోయాయని, వాటిని పరిష్కరించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.