ఆటలో బంగారు గొలుసు కిందపడేసుకున్న ఆర్సీబీ బ్యాటర్... ఆ తర్వాతేం జరిగింది?
- ఔటయ్యే క్రమంలో పిచ్‌పై గోల్డ్ చైన్ పడేసుకున్న జాకబ్ బెతెల్
- గమనించకుండా వెళ్లిపోగా, తర్వాత వచ్చిన పడిక్కల్ దానిని తిరిగిచ్చాడు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన
- ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ లో గత రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ ఓపెనర్ జాకబ్ బెతెల్ ఔటయ్యే క్రమంలో తన బంగారు గొలుసును పిచ్‌పైనే జారవిడుచుకుని, అది గమనించకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
రాయ్‌పూర్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ కార్తిక్ త్యాగి వేసిన బౌన్సర్‌ను బెతెల్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి హెల్మెట్‌కు తగిలి గాల్లోకి లేవగా, త్యాగి సులభంగా క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతని మెడలోని గోల్డ్ చైన్ తెగి పిచ్‌పై పడిపోయింది. కానీ ఔటయ్యానన్న నిరాశలో ఉన్న బెతెల్ ఈ విషయాన్ని గమనించలేదు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పడిక్కల్ పిచ్‌పై మెరుస్తున్న చైన్‌ను చూశాడు. వెంటనే దానిని చేతిలోకి తీసుకుని అంపైర్‌కు అప్పగించి తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, నెటిజన్లు సరదా కామెంట్లతో స్పందించారు. పడిక్కల్ స్పోర్ట్స్‌మన్‌షిప్‌ను పలువురు ప్రశంసించారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 192 పరుగులు చేయగా, ఆర్సీబీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (105*) అజేయ సెంచరీతో చెలరేగి జట్టును గెలిపించాడు. ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది 9వ సెంచరీ. ఈ మ్యాచ్‌లో బెతెల్ 15 పరుగులు చేశాడు.