రిలయన్స్ గ్రూపులో ఆకాశ్ అంబానీకి కీలక పదవి
- జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆకాశ్ అంబానీ
- ఏప్రిల్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి నియామకం
- రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపిన జియో ప్లాట్‌ఫామ్స్
జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. రిలయన్స్‌కు చెందిన ఈ డిజిటల్ సేవల సంస్థ ఐపీవోకు వెళ్ళనుంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ అంబానీని మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ నియామకం అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఐదేళ్ల కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని మే 7వ తేదీన సమర్పించిన ఫైలింగ్ లో పేర్కొంది.
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు సన్నద్ధమవుతున్న వేళ ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది మే నెలాఖరున లేదా జూన్ నెలలో ఐపీవోకు సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించే అవకాశం ఉంది. టెలికం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డులో 2014 అక్టోబర్ నుంచి ఆకాశ్ అంబానీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2022 జూన్ నెలలో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఆకాశ్ అంబానీ నేతృత్వంలో జియో 2016లోనే కేవలం ఆరు నెలల వ్యవధిలో 10 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.30 వేల కోట్ల నికర లాభాన్ని రూ.1.46 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.