'పెద్ది' పవర్ ప్లే టూర్.. దేశవ్యాప్తంగా వరుస ప్రమోషన్స్ తో క్రేజీ ప్లానింగ్!
- 'పెద్ది పవర్‌ప్లే టూర్' పేరుతో దేశవ్యాప్తంగా ప్రచారం
- మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్‌తో టూర్ ప్రారంభం
- ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక ప్రమోషన్స్
- సినిమాలో క్రికెటర్ పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్
- జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది' చిత్రం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ప్రచార కార్యక్రమాలను కూడా అదే స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో 'పెద్ది పవర్‌ప్లే టూర్' పేరుతో దేశవ్యాప్తంగా ఓ భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ పర్యటన ద్వారా చిత్ర యూనిట్ నేరుగా అభిమానులతో, ప్రేక్షకులతో మమేకమవనుంది.
మే 18న ముంబైలో ఈ ప్రమోషనల్ టూర్ ప్రారంభం కానుంది. ఈ టూర్ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో జరగనుంది. ముంబైలో మొదలయ్యే ఈ యాత్ర విజయనగరం మీదుగా హైదరాబాద్‌లో ముగుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా చిత్ర బృందం మీడియా సమావేశాలు, అభిమానులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొననుంది.
'పవర్‌ప్లే టూర్' పూర్తి షెడ్యూల్:
మే 18: ముంబై (ట్రైలర్ విడుదల)
మే 22: ఉప్పల్ స్టేడియం, హైదరాబాద్
మే 23: భోపాల్ (స్పెషల్ సాంగ్ లాంచ్)
మే 24: బెంగళూరు
మే 28: ఢిల్లీ
మే 30: చెన్నై
జూన్ 1: విజయనగరం
జూన్ 2: హైదరాబాద్
ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక సందడి
'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో ప్రచారంలోనూ ఆ థీమ్‌ను కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా మే 22న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ సందర్భంగా 'పెద్ది' టీమ్ సందడి చేయనుంది. ఇది సినిమా ప్రచారానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఇక, ముంబైలో జరిగే తొలి ఈవెంట్‌లో సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనుండగా, మే 23న భోపాల్‌లో ఓ స్పెషల్ సాంగ్‌ను లాంఛ్ చేయనున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, జూన్ 4న 'పెద్ది' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.