టెన్షన్ మధ్యే భారత్‌కు వంటగ్యాస్.. హర్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్పీజీ నౌకలు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ భారత్‌కు ఇంధన నౌకలు
హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటిన రెండు వంటగ్యాస్ నౌకలు
ఒక నౌక గుజరాత్‌లోని కాండ్లాకు.. మరొకటి మంగళూరుకు ప్రయాణం
ఈ మార్గంలో ఇంధన సరఫరా క్రమంగా పునరుద్ధరణ

అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్‌కు వంటగ్యాస్ (ఎల్పీజీ) తీసుకువస్తున్న రెండు నౌకలు వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. ఈ పరిణామంతో ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఈ సముద్ర వాణిజ్య మార్గంలో ఇంధన రవాణా క్రమంగా పునరుద్ధరణ అవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
వివరాల్లోకి వెళితే... 'సిమి' అనే ఎల్పీజీ నౌక గురువారం ఒమన్ గల్ఫ్‌లోకి ప్రవేశించింది. ఈ ప్రయాణ సమయంలో తన ట్రాన్స్‌పాండర్‌ను తాత్కాలికంగా స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. ఈ నౌక ఖతార్‌లోని రాస్ లఫాన్ పోర్టు నుంచి గుజరాత్‌లోని కాండ్లాకు వస్తోంది. యూఏఈలోని రువాయిస్ రిఫైనరీ నుంచి వంటగ్యాస్‌తో బయలుదేరిన 'ఎన్వీ సన్‌షైన్' అనే మరో నౌక కూడా ఈ జలసంధిని దాటిన తర్వాత సిగ్నల్స్ నిలిపివేసింది. ఈ నౌక కర్ణాటకలోని మంగళూరు వైపు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు ఇరాన్‌తో కాల్పుల విరమణ ప్రయత్నాలు 'లైఫ్ సపోర్ట్‌పై' ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై ఇరాన్ స్పందన 'పూర్తిగా ఆమోదయోగ్యం కాదు' అని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో పేర్కొన్నారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ తమ స్పందనను పంపింది. ప్రపంచ ముడిచమురు, ఎల్ఎన్జీ రవాణాలో అధిక భాగం హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. ముఖ్యంగా భారత్‌కు అవసరమైన ఇంధన సరఫరాలో ఈ మార్గం చాలా కీలకం.