సీఎం విజయ్‌కు జగన్ అభినందనలు.. పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు

Vijay Congratulated by Jagan on Becoming CM
  • విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
  • ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచన
  • ప్రజలకు న్యాయం చేస్తే విజయ్‌కు తిరుగుండదని వ్యాఖ్య
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ నటుడు విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ చారిత్రక విజయం సాధించి, విజయ్ ముఖ్యమంత్రి పదవిని అలంకరించినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా విజయ్‌తో మాట్లాడిన జగన్, ప్రజలు ఆయన నాయకత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందిస్తారని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలకు న్యాయం చేస్తే విజయ్‌కు తిరుగుండదని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Go Back to Shorts
Vijay
Tamil Nadu Chief Minister
Y S Jagan Mohan Reddy
Tamilaga Vetri Kazhagam
TVK Party
Tamil Nadu Assembly Elections
Tamil Nadu Politics
Andhra Pradesh
political news

More Telugu News