ఆక్వా రైతులను ఆదుకోండి: కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ
- రొయ్యల ఫీడ్ ముడిసరుకుల ధరల పెరుగుదలపై ఆందోళన
- టన్ను ఫీడ్‌పై రైతుకు రూ.25 వేల అదనపు భారంగా మారిందని వెల్లడి
- సోయాబీన్ మీల్ దిగుమతులపై సడలింపులు ఇవ్వాలని వినతి
- ఫీడ్ ధరల పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రొయ్యల ఫీడ్ తయారీలో వాడే ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు నష్టపోతున్నారని, తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు.
ఫీడ్ ధరలు పెరగడం వల్ల రైతుల పెట్టుబడి వ్యయం అమాంతం పెరిగిపోయిందని చంద్రబాబు తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల టన్ను ఫీడ్‌పై సుమారు రూ.25వేల వరకు అదనపు భారం పడుతోందని ఆయన వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు రొయ్యల సాగు నుంచి తప్పుకునే ప్రమాదం ఉందని, అది రాష్ట్ర ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ఈ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ముఖ్యంగా రొయ్యల ఫీడ్‌లో కీలకమైన సోయాబీన్ మీల్, సోయా ఆయిల్ దిగుమతులపై ఉన్న ఆంక్షలను సడలించాలని విజ్ఞప్తి చేశారు. దేశీయ అవసరాలకు సరిపడా ముడిపదార్థాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
రైతులకు సరసమైన ధరలకే ఫీడ్ లభించేలా చూడటంతో పాటు, ఫీడ్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు సూచించారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.