సూపర్‌ షి ఐలాండ్.. ఈ దీవి స్త్రీలకు మాత్రమే

Supershe Island Exclusive Retreat for Women in Baltic Sea
  • 2017లో మహిళలకు మాత్రమే ప్రారంభించిన క్రిస్టినా రోత్
  • 8.4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ద్వీపం
  • ఫిన్‌లాండ్ సమీపంలోని బాల్టిక్ సముద్రంలో మహిళలకు ప్రత్యేక ప్రదేశం
ఫిన్‌లాండ్ సమీపంలో మహిళలు మాత్రమే నివసించే ప్రదేశం ఉందంటే నమ్ముతారా? మీరు విన్నది నిజమే, అక్కడ పురుషులెవరూ కనిపించరు. ఫిన్‌లాండ్ సమీపంలోని బాల్టిక్ సముద్రంలో ఉన్న ఈ ద్వీపం ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన ప్రదేశాలలో ఒకటిగా ఇది నిలిచింది. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ ద్వీపంలో పురుషులకు ప్రవేశంలేదు.

8.4 ఎకరాలలో ఈ ద్వీపం ఉంది. కేవలం మహిళల కోసమే ఏర్పాటు చేసిన విలాసవంతమైన వెల్నెస్ రిట్రీట్ ప్రదేశమిది. అంటే మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి, రిఫ్రెష్ కావడానికి, ఏకాంతంగా గడపడానికి సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది. దీనిని సూపర్‌ షి ఐలాండ్ అంటారు. సూపర్‌ షి అధికారిక వెబ్ సైట్ ప్రకారం, దీనిని క్రిస్టినా రోత్ అనే మహిళ 2017లో ప్రారంభించారు.

మహిళల కోసం ప్రత్యేక స్థలాన్ని సృష్టించాలనే నిర్ణయం, స్పృహతో ఏర్పాటు చేసిందే ఈ సూపర్‌ షి ఐలాండ్. ఈ ప్రదేశానికి వచ్చే మహిళలు వారి ఒత్తిళ్ళను దూరం చేసుకోవడానికి, తమతో తాము ఏకాంతంగా గడపడానికి ఎంతో అనువైన ప్రదేశమని నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ ద్వీపంలో పర్యటించాలనుకోగానే వెళ్లడం కుదరదు. ఇక్కడకు వెళ్లడానికి మొదట దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేసిన తర్వాత మాత్రమే మహిళలు ఈ ద్వీపానికి వెళ్లి బస చేయగలుగుతారు. మహిళలకు మాత్రమే అనుమతి ఉండటం, అదీ దరఖాస్తు చేసుకున్నాక ఎంపిక చేయడం వంటి అంశాలు ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది.

ప్రతి విడిదిలో పదిమంది మహిళలకు మాత్రమే ఈ సూపర్‌ షి ఐలాండ్‌లో విడిదికి అవకాశం కల్పిస్తారు. యోగా, ధ్యానం, బాల్టిక్ సముద్రంలో కయాకింగ్, వెల్నెస్ వర్క్ షాప్, వంట తరగతులు, డిజిటల్ డిటాక్స్ వంటి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. క్రిస్టినా రోత్ ఈ ద్వీపాన్ని ప్రారంభించినప్పుడు కేవలం నిర్మాణ కార్మికులను మాత్రమే అనుమతించారు.
Go Back to Shorts
Supershe Island
Finland
women only island
Baltic Sea
Christina Roth
wellness retreat
womens retreat

More Telugu News