చిరంజీవి సినిమాల్లో రెండు సార్లు ఆఫర్లు వచ్చినా వదులుకున్నా: ఇంద్రజ

Indraja reveals missed Chiranjeevi movie opportunities
  • 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఇంద్రజ
  • అల్లుడా మజాకా, హిట్లర్ సినిమాల్లో అవకాశం వచ్చినా వదులుకున్న వైనం
  • చెల్లెలు పాత్ర రావడంతో ఒక సినిమా, డేట్స్ కుదరక మరో సినిమా వలుకున్న ఇంద్రజ

90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఇంద్రజకు మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించాలనే కోరిక బలంగా ఉండేదట. ఆమె కోరుకున్నట్టుగానే చిరంజీవితో నటించే అవకాశం ఆమెకు రెండు సార్లు వచ్చింది. అయితే, చిరంజీవి పక్కన ఛాన్స్ వచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. మొదటిసారి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడా మజాకా’ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం ఆమెను సంప్రదించారు. కానీ, చిరంజీవి పక్కన హీరోయిన్‌గా నటించాలని లేదా కనీసం ఆయనతో కలిసి ఒక మాస్ సాంగ్‌లో స్టెప్పులు వేయాలని ఆశించిన ఇంద్రజ, చెల్లెలి పాత్ర కావడంతో ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. 


ఆ తర్వాత ఎడిటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందిన ‘హిట్లర్’ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పటికే మరో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల డేట్స్ కుదరక ఆ ఛాన్స్‌ను కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇలా రెండు గొప్ప అవకాశాలు చేజారినందుకు ఇప్పటికీ చిన్న అసంతృప్తి ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

Go Back to Shorts
Indraja
Chiranjeevi
Alluda Mazaka
Hitler Movie
Telugu cinema
EVV Satyanarayana
Editor Mohan
Rajendra Prasad
Telugu actress
Movie offers

More Telugu News