రైతులకు గుడ్ న్యూస్.. పంటల మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం

Narendra Modi Government Hikes MSP for Kharif Crops
  • ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం
  • రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు
  • క్వింటాల్ వరికి రూ. 2,441గా మద్దతు ధర

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి భారీ ఊరటనిచ్చింది. రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 


రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా, ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది. పెట్టుబడి ఖర్చుపై 50 శాతం అదనంగా కలిపి కొత్త ధరలను ఖరారు చేశారు. వరి క్వింటాల్‌కు రూ. 2,441 గా నిర్ణయించారు. గ్రేడ్-ఏ వరి క్వింటాల్‌కు రూ. 2,461 గా మద్దతు ధరను ఖరారు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ మద్దతు ధర కోసం కేంద్రం ఏకంగా రూ. 2.6 లక్షల కోట్లను కేటాయించడం విశేషం.


వ్యవసాయంతో పాటు రవాణా, ఇంధన రంగాలకు కూడా కేంద్ర కేబినెట్ పెద్దపీట వేసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపారు. ఇంధన భద్రత కోసం ఈ పథకానికి రూ. 37,500 కోట్లు కేటాయించారు. సర్కేజీ - ధోలేరా మధ్య సెమీ హై స్పీడ్ డబుల్ రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ. 20,065 కోట్లు మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Go Back to Shorts
Narendra Modi
Farmers
MSP
Kharif Crops
Minimum Support Price
Agriculture
Cabinet Meeting
Crop Prices
Indian Farmers
Agriculture News

More Telugu News