నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల రహస్య స్థావరం గుర్తింపు

  • 'మాద్ బచావో అభియాన్' కింద చేపట్టిన ఆపరేషన్‌లో స్థావరం గుర్తింపు
  • భారీగా నగదు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యం
  • ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు వెల్లడి
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల రహస్య స్థావరాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. 'మాద్ బచావో అభియాన్' కింద డీఆర్జీ, ఎస్‌టీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీగా నగదు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

రూ.1.64 కోట్ల నగదు, మూడు ఏకే-47 రైఫిళ్లు, మూడు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, రెండు నాటు తుపాకులు సహా భారీగా ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వందలాది తూటాలు, మ్యాగజైన్‌లు, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్, వాకీ టాకీ సెట్లు లభ్యమయ్యాయి. మావోయిస్టు రహిత జిల్లాగా తయారు చేసేందుకు ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.

Narayananpur
Chhattisgarh
Maoists
Maoist Hideout
DRG
STF
ITBP
BSF
Anti-Maoist Operation
Naxalites

More Telugu News