కోర్టుకు హాజరు కావాలంటూ కవితకు నోటీసులు

  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో రైల్ రోకో
  • కవితపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు
  • విచారణకు రావాలంటూ సికింద్రాబాద్‌లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు సమన్లు

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో కామారెడ్డిలో రైల్‌రోకో నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలతో ఆమెతో పాటు మరో 12 మందిపై రైల్వే యాక్ట్‌లోని యూ/సెక్షన్ 147, 74(ఏ) కింద కేసులు నమోదయ్యాయి. 


ఈ కేసు విచారణలో భాగంగా సికింద్రాబాద్‌లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు కవితకు సమన్లు జారీ చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.


K Kavitha
Kalvakuntla Kavitha
Telangana Rakshana Sena
Railway Police
Rail Roko
BC Reservations
Kamareddy
Secunderabad Court
Railway Act

More Telugu News