ఉర్విల్ పటేల్ ఐపీఎల్ రికార్డు ఫిఫ్టీ వెనుక ధోనీ సలహా
- ధోనీ ఇచ్చిన సలహాతోనే రికార్డు ఫిఫ్టీ సాధ్యమైందన్న ఉర్విల్ పటేల్
- లక్నోపై 13 బంతుల్లోనే అర్ధశతకం సాధించి రికార్డు సమం
- తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని తండ్రికి అంకితమిచ్చిన యువ బ్యాటర్
- మానసికంగా స్పష్టంగా ఉండాలని ధోనీ సూచించినట్లు వెల్లడి
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న యువ సంచలనం ఉర్విల్ పటేల్, తన రికార్డు అర్ధశతకం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించాడు. చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన ఒక కీలక సలహా తన ఆటతీరును పూర్తిగా మార్చేసిందని తెలిపాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి, ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన అర్ధశతకం రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే.
ఆదివారం చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉర్విల్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 65 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ సీజన్లో గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న ధోనీతో డ్రెస్సింగ్ రూమ్‌లో జరిపిన సంభాషణ గురించి ఉర్విల్ తాజాగా ఐపీఎల్ విడుదల చేసిన వీడియోలో పంచుకున్నాడు. "గత కొన్ని మ్యాచ్‌ల్లో మంచి ఆరంభం లభించినా త్వరగా ఔటవుతున్నానని మహీ భాయ్‌తో చెప్పాను. అప్పుడు అతడు 'నీ నైపుణ్యంపై నాకు ఎలాంటి సందేహం లేదు. సందేహమల్లా నీ మనసులోనే ఉంది. కాబట్టి మానసికంగా స్పష్టంగా ఉండు, సరైన బంతిని సరైన చోట కొట్టడానికి ప్రయత్నించు' అని ఒక్కటే మాట చెప్పాడు" అని ఉర్విల్ వివరించాడు.
ధోనీ మాటలతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఎలాంటి సందేహాలు లేకుండా సహజమైన ఆటతీరును ప్రదర్శించగలిగానని పేర్కొన్నాడు. ఈ ప్రదర్శనతో ధోనీ ఎంతో సంతోషిస్తాడని భావిస్తున్నట్లు తెలిపాడు.
తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని చారిత్రాత్మక రీతిలో సాధించడంపై ఉర్విల్ భావోద్వేగానికి గురయ్యాడు. "నా తొలి ఐపీఎల్ 50... ఇప్పుడు దానిని నాన్నకు అంకితమిస్తున్నాను" అంటూ రాసి ఉన్న నోట్‌ను మైదానంలో ప్రదర్శించాడు. గత మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ, భయం లేకుండా ఆడమని తన తండ్రి ఎప్పుడూ ప్రోత్సహించేవారని ఉర్విల్ గుర్తుచేసుకున్నాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా పిచ్ గురించి చెప్పిన మాటలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఉర్విల్ పటేల్ వెల్లడించాడు.