టిమ్ డేవిడ్ 'అసభ్యకర సైగ' వివాదం.. చర్యలు తప్పవా?

Tim David Middle Finger Gesture Controversy After RCB Win
  • ముంబై ఇండియన్స్‌పై గెలుపు తర్వాత టిమ్ డేవిడ్ అసభ్యకర సైగ
  • మిడిల్ ఫింగర్ చూయిస్తూ టిమ్ డేవిడ్ సెలబ్రేషన్స్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • గతంలో ముంబై జట్టుకు ఆడిన డేవిడ్.. ఈ మ్యాచ్‌లో డకౌట్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. తన పాత జట్టు ముంబై ఇండియన్స్ (ఎంఐ) పై ఉత్కంఠభరిత విజయం సాధించిన తర్వాత అతను అసభ్యకరమైన రీతిలో 'మిడిల్ ఫింగర్' సైగ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గతంలో మూడు సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన టిమ్ డేవిడ్‌ను, 2025 వేలంలో ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అతను బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే, ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్ చివరి బంతికి ఆర్‌సీబీ గెలవడంతో డగౌట్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన దశలో, రొమారియో షెపర్డ్ ఔటవ్వడంతో ముంబై గెలుపు ఖాయమనిపించింది. కానీ, భువనేశ్వర్ కుమార్ సిక్సర్, ఆపై రసిఖ్ సలామ్ లాంఛనం పూర్తి చేయడంతో ఆర్‌సీబీ విజయం సాధించింది. ఈ సంబరాల సమయంలోనే డేవిడ్ అలా ప్రవర్తించాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే, ఈ వీడియో నిజమని తేలితే, డేవిడ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
Tim David
RCB
Royal Challengers Bangalore
Mumbai Indians
IPL
Indian Premier League
Middle Finger Gesture
Controversy
Romario Shepherd
Rasikh Salam

More Telugu News