ముగిసిన జగన్ విదేశీ పర్యటన.. బెంగళూరు చేరుకున్న జగన్ దంపతులు

Jagan Mohan Reddy Foreign Trip Ends Reaches Bangalore
  • 15 రోజుల పాటు యూరప్ లో గడిపిన జగన్
  • బిజీ రాజకీయాలకు దూరంగా కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన వైసీపీ అధినేత
  • రెండు రోజుల పాటు బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్న జగన్

వైసీపీ అధినేత జగన్ తన విదేశీ పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. గత నెల 26వ తేదీన తన భార్య భారతీ రెడ్డితో కలిసి యూరప్ వెళ్ళిన ఆయన, అక్కడ సుమారు 15 రోజుల పాటు తన కుమార్తెలతో గడిపారు. ఈ తెల్లవారుజామున యూరప్ నుండి నేరుగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జగన్ దంపతులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.


ఈ పర్యటనలో అందరినీ ఆకర్షించిన ప్రధాన అంశం జగన్ 'కొత్త లుక్'. సాధారణంగా తెలుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్లలో కనిపించే జగన్, ఈసారి అందుకు భిన్నంగా జీన్స్ ప్యాంట్, షర్ట్ ధరించి చాలా క్యాజువల్ లుక్‌లో కనిపించారు. తన విదేశీ పర్యటనల్లో మాత్రమే ఆయన ఇలాంటి వెస్ట్రన్ దుస్తుల్లో కనిపిస్తుంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.


ప్రస్తుతం బెంగళూరులోని తన నివాసంలో ఉన్న జగన్, అక్కడ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత తాడేపల్లికి చేరుకుని, తిరిగి పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలని భావిస్తున్నారు.

Go Back to Shorts
Jagan Mohan Reddy
YS Jagan
Jagan Bangalore
Bharati Reddy
YSRCP
Andhra Pradesh Politics
Jagan Europe Trip
Tadepalli
Jagan new look
AP CM

More Telugu News