Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొదట ఇంగ్లిస్, ఆఖర్లో షాబాజ్... చెన్నైకి లక్నో భారీ టార్గెట్

Josh Inglis and Shahbaz Ahmed propel Lucknow to big target against Chennai
Advertisement
  • చెన్నైతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు
  • 33 బంతుల్లో 85 పరుగులు చేసిన ఓపెనర్ జోష్ ఇంగ్లిస్
  • ఆఖర్లో మెరిసిన షాబాజ్ అహ్మద్.. 43 పరుగులతో నాటౌట్
  • చెన్నై సూపర్ కింగ్స్ ముందు 204 పరుగుల లక్ష్యం
  • సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్‌కు మూడు వికెట్లు
Advertisement
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ (85) విధ్వంసకర ఆరంభం, ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (43*) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతను బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. కేవలం 33 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. దీంతో పవర్‌ప్లేలోనే లక్నో స్కోరు పరుగులు పెట్టింది. అయితే, ఇంగ్లిస్ ఔటయ్యాక లక్నో ఇన్నింగ్స్ నెమ్మదించింది. నికోలస్ పూరన్ (1), కెప్టెన్ రిషభ్ పంత్ (15), ఐడెన్ మార్క్‌రమ్ (6) తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో మధ్య ఓవర్లలో లక్నో తడబడింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఆఖరి ఓవర్లలో దూకుడుగా ఆడిన అతను 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హిమ్మత్ సింగ్ (17)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును 200 దాటించాడు.

చెన్నై బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లతో సత్తా చాటగా, అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్ పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.
Advertisement
Advertisement
Josh Inglis
Lucknow Super Giants
Chennai Super Kings
IPL 2026
Shahbaz Ahmed
MA Chidambaram Stadium
T20 Cricket
Indian Premier League
Jamie Overton
Anshul Kamboj

More Telugu News