హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ నివాసాలకు మోదీ!
- నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లి భేటీకానున్న ప్రధాని
- రూ.9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
- పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభలో ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆదివారం హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మిత్రపక్ష నేతలతో ప్రధాని సమావేశం కానుండటంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అలాగే, ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్‌ను ఆయన నివాసంలో పరామర్శిస్తారు. పవన్ ఇంటి వద్దకు నటుడు చిరంజీవి కూడా వచ్చి ప్రధానితో ముచ్చటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ రాజకీయ భేటీలతో పాటు, ప్రధాని పలు అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. హెచ్‌ఐసీసీలో జరిగే కార్యక్రమంలో భాగంగా రూ.9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ప్రధాని పర్యటనను బీజేపీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెచ్‌ఐసీసీ, గచ్చిబౌలిలోని సాయిసింధు ఆసుపత్రి ప్రారంభోత్సవం, నేతలతో భేటీలు, పరేడ్ గ్రౌండ్స్ సభ వంటి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.