ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణే సరిపోదు: రేవంత్ రెడ్డి
- ఆధునికీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు
- పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలన్న సీఎం
- నగరాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా అభివృద్ధిని మూడు విభాగాలుగా విభజించుకున్నట్లు వెల్లడి
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆధునికీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని అన్నారు. అండర్‌పాస్, సర్ఫేస్ ఎలివేటెడ్ అనే త్రీ లెవల్ విధానాన్ని తీసుకురావాలని అన్నారు. మల్టీ ట్రాన్స్ పోర్ట్ సిస్టంను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
క్యూర్, ప్యూర్, రేర్‌గా అభివృద్ధిని మూడు భాగాలుగా విభజించుకున్నామని అన్నారు. ఔటర్ రింగు రోడ్డు క్యూర్ ఏరియాను సర్వీస్ సెక్టార్‌గా గుర్తించామని అన్నారు. ఓఆర్ఆర్ బయట, ఆర్ఆర్ఆర్ లోపల ఉన్న ప్యూర్ ఏరియాను తయారీ రంగంగా, ఆర్ఆర్ఆర్ బయట ఉన్న రేర్ ఏరియాను అగ్రికల్చర్ సెక్టారుగా గుర్తించామని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరించుకున్నామని అన్నారు.